నర్సాపూర్: ఆరు గ్యారంటీలు, 420 హామీలతో రాష్ట్ర ప్రజలను దగా చేసిన కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెబుదామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి నివాసంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులతో కీలక భేటీ నిర్వహించారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన, తెలంగాణ ప్రజల పాలిట తీవ్ర శాపంగా మారిందన్నారు. మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు వారం రోజుల పాటు ఉమ్మడి జిల్లాలోని గ్రామగ్రామన నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కుదేలు చేశారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ముఖ్య నేతలకు వివరించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి గడపకు తీసుకువెళ్లి ఎండగట్టాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏకతాటిపై ఉండి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని హితవు పలికారు. సమావేశంలో ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, మాణాక్‌రావు, చింతా ప్రభాకర్, గూడెం మహిపాల్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్‌రెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు


