ప్రజల అవస్థలు పట్టవా? | - | Sakshi
Sakshi News home page

ప్రజల అవస్థలు పట్టవా?

Sep 1 2026 7:41 AM | Updated on Sep 1 2026 7:41 AM

మెదక్‌ కలెక్టరేట్‌: మెదక్‌ నుంచి పిల్లికోటాల మీదుగా వెల్దుర్తి వరకు ఉన్న రోడ్డును వెంటనే పునరుద్ధరించాలని నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డి, మెదక్‌ మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం వెల్దుర్తి నుంచి పిల్లికోటాల్‌ వరకు పాదయాత్ర నిర్వహించి ఆయా గ్రామాల ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్‌ చేరుకొని ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ అంబదాస్‌ రాజేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. వెల్దుర్తి–పిల్లికొట్టాల రహదారి అధ్వానంగా మారడంతో నిత్యం రాకపోకలు సాగించే ప్రజలు, వాహనదారులు అనేక అవస్థలు పడుతు న్నారని వాపోయారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక గతంలో మంజూరైన నిధులను రద్దు చేసిందని ఆరోపించారు. వెంటనే డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement