ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణికి వచ్చే దరఖాస్తులకు తక్షణ పరిష్కారం చూపాలని ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 48 వినతులు స్వీకరించారు. అందులో భూ భారతి–16, ఇందిరమ్మ ఇండ్లు–6, పెన్షన్లు 1, ఇతర దరఖాస్తులు 25 కలిపి మొత్తం 48 వచ్చినట్లు తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం చేయొద్దని సూచించారు. పరిష్కరించిన వాటిని వెంటనే పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


