ప్రాసెసింగ్ చార్జీల పేరుతో రైతులనుంచి రూ.1.57 కోట్లు అదనపు వసూళ్లు
బ్యాంకు నిర్వహణ పేరుతో నిధులు స్వాహా!
గత పాలకవర్గం నేత, బదిలీపై వెళ్లిన ‘ముఖ్య’అధికారి కలిసి దందా!
జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఆలస్యంగా వెలుగులోకి వ్యవహారం
మెదక్‌జోన్: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యతనిస్తోందని కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని వెల్‌కమ్ బోర్డు చౌరస్తా నుంచి ధ్యాన్‌చంద్ చౌరస్తా వరకు పురుషులకు 5 కిలోమీటర్ల రన్నింగ్, మహిళలకు బస్టాండ్ నుంచి ధ్యాన్‌చంద్ చౌరస్తా వరకు 2 కిలోమీటర్ల రన్నింగ్ కార్యక్రమాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మేజర్ ధ్యాన్‌చంద్ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తారన్నారు. క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలని కోరారు. క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ధ్యాన్‌చంద్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్, యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేశ్, మెదక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు జుబేర్ అహ్మద్, చైర్మన్ శివ, డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా పౌర సంబంధాల అధికారి రామచంద్రరాజు పాల్గొన్నారు.
గోదాముల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యం లక్ష్యంగా పీఏసీఎస్‌లలో గోదాముల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశాన్ని డీసీఓ పద్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...30,000 మెట్రిక్ టన్నుల ధాన్య నిల్వ సామర్థ్య లక్ష్యాన్ని సాధించే దిశగా జిల్లాలోని అనువైన పీఏసీఎస్‌లను గుర్తించి గోదాముల నిర్మాణం చేపట్టాలని సమావేశంలో చర్చించారు.
జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్
డాక్టర్ సునీత
మెదక్ కలెక్టరేట్: దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సౌకర్యాలు సులభంగా అందేలాలా యూడీఐడీ కార్డులు తప్పనిసరని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత స్పష్టం చేశారు. ప్రభుత్వ దివ్యాంగుల సాధికారతే లక్ష్యంగా యూడీఐడీ శిబిరం నిర్వహించినట్లు ఆమె తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో శనివారం దివ్యాంగుల యూడీఐడీ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీత మాట్లాడుతూ...మెదక్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిర్వహించిన శిబిరంలో మొత్తం 175 స్లాట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో 147 మంది దివ్యాంగులు హాజరైనట్లు చెప్పారు. లోకోమోటర్ డిజేబిలిటీ 66మంది, జనరల్ మెడిసిన్ 26 మంది, కంటి వైద్య విభాగం 18 మంది, ఈఎన్‌టీ విభాగం: 20 మంది, సైకియాట్రీ: 12 మంది, పీడియాట్రిక్స్ 05 మంది హాజరైనట్లు తెలిపారు.
మెదక్ కలెక్టరేట్: విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని మైనార్టీ కమిషన్ జిల్లా చైర్మన్ సూఫీజానీ పేర్కొన్నారు. జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ఉపేందర్‌తో కలిసి శనివారం సాయంత్రం మైనార్టీ బాలికల జూనియర్ కళాశాల, హాస్టల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ కిచెన్‌ను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సూఫీజానీ మాట్లాడుతూ..స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు ఆదేశాల మేరకు హాస్టల్, కళాశాల తనిఖీ నిర్వహించానన్నారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఉన్నారు.
సంగారెడ్డి టౌన్ : గ్రామీణ ప్రాంత పురుషులకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా పుట్టగొడుగుల పెంపకం, సీసీ కెమెరా సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి కల్పనా డైరెక్టర్ రాజేశ్‌కుమార్ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. తెల్ల రేషన్‌కార్డు కలిగి ఉండి 19 నుంచి 45 ఏళ్లు కలిగిన పురుషులకు ఉచిత శిక్షణ శిక్షణతోపాటు ఉచిత వసతి, ఉచిత భోజనం కల్పిస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డి,మెదక్ జిల్లాల వారికి అవకాశముందని సెప్టెంబర్ 8 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని పూర్తి సర్టిఫికెట్లతో 9704446956, 9949964097 నంబర్‌కు సంప్రదించాలన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో అన్ని ఉమ్మడి జిల్లాలకు ఉన్న డీసీసీబీల్లో లేనివిధంగా ఇక్కడ ఈ అదనపు చార్జీలు వసూలు చేశారు. నిబంధనల ప్రకారం పంట రుణాలపై 7% వడ్డీని వసూలు చేయాలి. కానీ ఈ అక్రమార్కులు తమ జేబులు నింపుకునేందుకు అదనంగా 1% ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేశారు. అంటే రూ.లక్ష రుణం తీసుకున్న రైతు రూ.7వేల వడ్డీ చెల్లించాల్సి ఉండగా, అదనంగా రూ.వెయ్యి చొప్పున వసూలు చేశారు. ఇలా జిల్లావ్యాప్తంగా సుమారు వెయ్యిమంది రైతుల వద్ద ఈ అనధికారిక వసూళ్ల దందా సాగింది. అన్నదాతలను నిండా ముంచేశారు.
రైతులు తిరగబడటంతో వెనక్కి!
అమాయక రైతులు, నిరక్షరాస్యుల వద్ద వసూళ్లు యథేచ్ఛగా సాగాయి. కానీ కాస్త చైతన్యం ఉన్న రైతులు ఈ అక్రమ వసూళ్లను ప్రశ్నించారు. ఎక్కడా లేనిది అదనంగా చార్జీలు ఎలా వసూలు చేస్తారని నిలదీశారు. దీంతో దాదాపు నాలుగు నెలలపాటు సాగిన ఈ వసూళ్ల దందాను గుట్టు చప్పుడు కాకుండా నిలిపివేశారు. రైతుల వాటాధనంగా నడుస్తున్న ఈ బ్యాంకు అదే రైతులకు ఇచ్చే పంట రుణాలపై అదనపు వసూళ్లు చేసి వారిని నిండా ముంచడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
ముగిసిన పాలకవర్గం తీర్మానాలు
ఈ అదనపు చార్జీల వసూళ్లకు మేనేజింగ్ కమిటీ (ఎంసీ) తీర్మానాలున్నాయని డీసీసీబీ వర్గాలు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే ఈ బ్యాంకు మేనేజ్‌మెంట్ కమిటీ (పాలకవర్గం) పదవీకాలం 2025 ఫిబ్రవరిలోనే ముగిసింది. కానీ అదనపు వసూళ్లకు 2025 జూన్ 12న తీర్మానం చేశారు. అంటే పదవీకాలం ముగిన పాలకవర్గం తీర్మానం ఎలా చెల్లుతుందో అధికారులకే తెలియాలి. అయితే పాలకవర్గం పదవీకాలం ముగిసినప్పటికీ ప్రభుత్వం వారి పదవీకాలాన్ని ఆరు నెలలు పొడిగించారని డీసీసీబీ అధికారులు చెబుతున్నారు. పొడిగించిన ఈ తాత్కాలిక పాలకవర్గానికి రైతులపై భారం మోపే తీర్మానాలు చేసే అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదు. 2025 జూన్ 12 నుంచి 2025 అక్టోబర్ 8 తేదీ వరకు ఈ రూ.1.57 కోట్లు వసూళ్లకు తెగబడ్డారు. రైతులు తిరగబడకపోతే ఈ వసూళ్ల దందా మరింత సాగే అవకాశాలుండేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా బ్యాంకు తీర్మానాలు చేసిన రైతులందరికీ తెలిసేలా పత్రికా ప్రకటన విడుదల చేయాలి. కానీ వసూళ్ల తీర్మానాలను బయటకు పొక్కకుండా గుట్టుచప్పుడు కాకుండా సర్క్యూలర్లు ఇచ్చేశారు.
ఎంత లాభాలుంటే అంత స్వాహా
బ్యాంకుకు ఎంత ఎక్కువ లాభాలు వస్తే అంతే మొత్తంలో స్వాహా చేయవచ్చనే ఈ అడ్డగోలు వసూళ్లకు తెరలేపారనే ఆరోపణలున్నాయి. బ్యాంకు నిర్వహణ ఖర్చుల పేరుతో ఈ డబ్బులు చాలా మట్టుకు డ్రా చేసినట్లు తెలుస్తోంది. అనేక సంవత్సరాలు ఇదే బ్యాంకులో పాతుకుపోయిన ఓ ‘ముఖ్య’అధికారి, గత పాలకవర్గంలోని కీలక నాయకుడు కలిసి చేసిన ఈ స్వాహా పర్వంలో గత పాలకవర్గంలోని మరికొందరికి వాటాలు పంచారనే ఆరోపణలున్నాయి. ఈ అక్రమదందాపై కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లడంతో అంతర్గత విచారణ జరుగుతోంది. నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతిని విచారణ అధికారిగా నియమించినట్లు సమాచారం.
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో అడ్డగోలు నిర్ణయాలతో అన్నదాతలను నిండా ముంచిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో ఏ డీసీసీబీల్లో లేనివిధంగా పంట రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు, ఇన్‌స్పెక్షన్ చార్జీల పేరుతో ఏకంగా రూ.1.57 కోట్లు వసూలు చేసేశారు. ఈ డబ్బును నిర్వహణ ఖర్చుల పేరుతో స్వాహా చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత పాలకవర్గంలో ఓ కీలక నాయకుడు, ఏళ్ల తరబడి బ్యాంకులో పాతుకుపోయి.. ఇటీవల బదిలీ అయిన ఓ ‘ముఖ్య’అధికారి కలిసి ఈ అక్రమాలకు తెరలేపారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ అక్రమార్కులు తమ జేబులు నింపుకునేందుకు ఆరుగాలం శ్రమించే అన్నదాతలపై అదనపు భారం మొపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి :
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు
వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించలేదు
పంటరుణాలపై వసూలు చేసిన ప్రాసెసింగ్ ఫీజు, ఇన్‌స్పెక్షన్ చార్జీలు ఎవరి వ్యక్తిగత ఖాతాకు మళ్లించలేదు. మిసిలీనియస్ ఇన్‌కమ్ ఖాతాలో జమ చేశాం. పంట రుణాలపై అదనపు చార్జీలు వసూలు చేసుకోవచ్చని ఆర్‌బీఐ నిబంధనలున్నాయి.
–సురేశ్, ఇన్‌చార్జి సీఈఓ, డీసీసీబీ
కలెక్టర్ ప్రతిమాసింగ్
మైనార్టీ కమిషన్ జిల్లా చైర్మన్ సూఫిజానీ
రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో గుట్టుగా నిలిపివేత


