ప్రభుత్వ కళాశాలలకు నిధులు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కళాశాలలకు నిధులు

Aug 30 2026 7:18 AM | Updated on Aug 30 2026 7:18 AM

● ఉమ్మడి మెదక్‌ జిల్లాకు రూ.35.25 లక్షలు విడుదల ● విద్యార్థుల సంఖ్య ప్రకారం కేటాయింపు ● తప్పనున్న నిర్వహణ ఇబ్బందులు

● ఉమ్మడి మెదక్‌ జిల్లాకు రూ.35.25 లక్షలు విడుదల ● విద్యార్థుల సంఖ్య ప్రకారం కేటాయింపు ● తప్పనున్న నిర్వహణ ఇబ్బందులు

సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా 2026–27 విద్యాసంవత్సరానికి ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 56 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల నిర్వహణకు రూ.35.25లక్షలు కేటాయించారు. ఈ నిధులు విద్యార్థుల సంఖ్య ఆధారంగా మంజూరు చేశారు. ఇందులో జనరల్‌ ఫండ్‌గా రూ.25,38,000, ఎస్సీ ఫండ్‌గా 5,99,250, ఎస్టీ నుంచి 3,87,750 నిధులు ఉన్నాయి.

మౌలిక వసతుల కోసం..

30 మందిలోపు ఉన్న కళాశాలలకు రూ.10 వేలు, 31 నుంచి 100 మంది ఉంటే రూ.25 వేలు, 101– 250 వరకు రూ.50 వేలు, 251 నుంచి వెయ్యి మంది ఉన్న కాలేజీలకు రూ.లక్ష వరకు నిధులను కేటాయించారు. ఈ నిధులతో కళాశాలకు కావాల్సిన స్టేషనరీ, ల్యాబ్‌ నిర్వహణ, చిన్నపాటి మరమ్మతులు, ఇతర మౌలిక వసతులను కల్పిస్తారు. చాక్‌పీసులు, తెల్లకాగితాలు, రిజిస్టర్లు, బుక్‌లెట్లు ఇతర వాటికి వినియోగించనున్నారు. నిధులు మంజూరుతో కాలేజీలకు ఇబ్బందులు తప్పనున్నాయి.

నిధుల విడుదల ఇలా..

జిల్లా కళాశాలలు నిధులు

సిద్దిపేట 20 రూ 12,00,000

మెదక్‌ 16 రూ 10,50,000

సంగారెడ్డి 20 రూ 12,75,000

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement