రైతు బీమా పథకాన్ని సకాలంలో రెన్యూవల్ చేయకపోవటంతో అకాల మరణం చెందిన రైతు కుటుంబాలను ఈ ప్రభుత్వం రోడ్డుమీద పడేస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది మరణించారు. వారి కుటుంబాల పరిస్థితి ఏంటి?
పాకాల శ్రీహరిరావు, తెలంగాణ రైతు సంరక్షణ సమితి అధ్యక్షుడు
ప్రభుత్వం నుంచి ఆదేశాల్లేవు
ఈ నెల 13న రైతుబీమా గడువు ముగిసింది. 14 నుంచి ఇప్పటివరకు జిల్లాలో 41 మంది రైతులు మరణించారు. వారి మరణ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు కావడంలేదు. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.
దేవ్‌కుమార్, వ్యవసాయశాఖ జిల్లా అధికారి


