భద్రత సవాలే.. | - | Sakshi
Sakshi News home page

భద్రత సవాలే..

Aug 28 2026 7:21 AM | Updated on Aug 28 2026 7:21 AM

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న రైల్వే అవుట్‌ పోస్టు పరిధిలో కామారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో కలిపి మొత్తం 20 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. మూడు జిల్లాల పరిధిలో సుమారు 200 కిలోమీటర్ల మేర రైల్వేలైన్‌ విస్తరించి ఉంది. కాగా, 35 ఏళ్ల క్రితమే ఈ అవుట్‌ పోస్టు ఏర్పాటైంది. మెదక్‌ జిల్లాలో అక్కన్నపేట నుంచి ప్రారంభమై జిల్లా శివారు కూచారం వరకు 45 కిలోమీటర్ల మేర రైల్వేలైన్‌ విస్తరించి ఉండగా, జిల్లా పరిధిలో 12 స్టేషన్లు ఉన్నాయి. జిల్లా పరిధిలోనే నెలలో కనీసం 15 నుంచి 18 వరకు రైల్వే కేసులు నమోదవుతున్నాయి. యువకులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం, గంజాయి సరఫరా, బియ్యం అక్ర మ రవాణాతో పాటు రైళ్లలో చోరీలు వెలుగు లోకి వస్తున్నాయి. ప్రయాణికులు ఏమరుపాటుగా ఉ న్నా బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్లు, బ్యాగు లు చోరీకి గురవుతున్నాయి.

అటకెక్కిన ప్రతిపాదనలు

ప్రతి జిల్లాలో కనీసం ఒక అవుట్‌ పోస్టు ఏర్పాటు చేయాలని ఆశాఖ ఉన్నతాధికారులు గతంలో నిర్ణయించినా, అది కార్యరూపం దాల్చలేదు. జిల్లా పరిధిలో ఒక అవుట్‌ పోస్టు ఏర్పాటు చేయాలని ఐదేళ్ల క్రితమే ఆశాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉన్న అవుట్‌ పోస్టు పరిధి ఎక్కువగా ఉండటంతో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట నేరాలు, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకోవడం ఆలస్యం అవుతుండటంతో బాధితులు ఇబ్బందులపాలవుతూ గంటలతరబడి నిరీక్షిస్తున్నారు.

తనిఖీలు కరువు

స్టేషన్లు, రైళ్లలో సరైన తనిఖీలు లేకపోవడం సంఘవిద్రోహులకు వరంగా మారింది. ఈరైల్వే లైన్‌ ఆరు రాష్ట్రాల వరకు విస్తరించి ఉండగా, ఇటీవల నిషేధిత వస్తువుల అక్రమ రవాణా పెరిగిందని రైల్వేశాఖ, ఎకై ్సజ్‌ అధికారులు చెప్పడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. గతంలో ఎక్స్‌ప్రెస్‌ రైలులో బాంబుపెట్టినట్లు అకతాయిలు ఫోన్‌కాల్‌ చేయడంతో రైలును నిలిపి ప్రత్యేక పోలీస్‌ బలగాలు తనిఖీలు నిర్వహించారు. కామారెడ్డి అవుట్‌ పోస్టు పరిధిలో అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతుండగా, దీనిపై దృష్టి పెట్టడానికి తగినంత సిబ్బంది లేరనే వాదన వినిపిస్తుంది. నాలుగేళ్ల క్రితం కామారెడ్డి రైల్వేస్టేషన్‌లో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది.

మూడు జిల్లాల పరిధిలోని స్టేషన్లు

కామారెడ్డి, తలమడ్ల, తిప్పాపూర్‌, బిక్కనూరు, రామేశన్‌పల్లి, అక్కన్నపేట, మీర్జాపల్లి, వడియారం,శ్రీనివాసనగర్‌, బ్రాహ్మణపల్లి, పాలాట పోతారం, మనోహరాబాద్‌, కూచారం, మెదక్‌, లక్ష్మాపూర్‌, ఔ రంగాబాద్‌, నాచారం, గజ్వేల్‌, కొడకండ్ల, సిద్దిపేట రైల్వేస్టేషన్ల ఉన్నాయి. ఈవిషయమై రైల్వేశాఖకు చెందిన అధికారి ఒకరు మాట్లాడుతూ.. జిల్లాలో ఒ క అవుట్‌పోస్ట్‌కు ప్రతిపాదనలు ఉన్నాయని, ఉన్నతాధికారులు దృష్టి సారించారని తెలిపారు.

మూడు జిల్లాలకు ఒకే ఒక్క పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌

20 రైల్వేస్టేషన్లు..

200 కిలోమీటర్ల పరిధిలో రక్షణ కరువు

నిత్యం ప్రమాదాలు.. చోరీలు

యథేచ్ఛగా మత్తు పదార్థాల రవాణా

మూడు జిల్లాలు.. 20 రైల్వేస్టేషన్లు.. 200 కిలోమీటర్ల పరిధి.. వెరసి ఒకే ఒక పోలీస్‌ అవుట్‌పోస్టు.. ఫలితంగా రైల్వేస్టేషన్ల పరిధిలో అక్రమ రవాణ, చోరీలు పెరుగుతున్నాయి. ప్రతి నెలా కనీసం 25 వరకు కేసులు నమోదవుతున్నాయి.

– రామాయంపేట(మెదక్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement