నారాయణఖేడ్: ఖేడ్ మండలం ఆకలాయి తండాలో గురువారం తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివాహం కాని యువతులు తమకు మంచి భర్త రావాలని కోరుకోగా, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని తండా వాసులు వేడుకున్నారు. మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంజారా సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ చౌహాన్, టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్ సందర్శించి తండాలోని భవానీమాత, సేవాలాల్ మహారాజ్ ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.


