మెదక్ కలెక్టరేట్: సమస్యల పరిష్కారం కోసం పంచాయతీ కార్మికులు కదం తొక్కారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వీరికి సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. ఈసందర్భంగా సంఘం జిల్లా కోశాధికారి నర్సమ్మ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రెండు రోజుల పాటు జిల్లా కేంద్రంలో నిరాహార దీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. కార్మికులు ఏళ్ల తరబడి పని చేసినా పనికి భద్రత, కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ ప్రమాద బీమా లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. కార్మికులను అక్రమంగా తొలగిస్తున్న సర్పంచ్‌లపైన చర్యలు చేపట్టాలని, ఆన్‌లైన్‌లో నమోదు కాని వారి పేర్లను వెంటనే నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ జిల్లా ఆఫీస్ బేరర్స్ వసంత, రఘుపతి, సత్యం, మల్లేష్, వెంకయ్య, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.


