బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి
నిజాంపేట(మెదక్): యూరియా యాప్‌ను వెంటనే తొలగించాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. యూరియా యాప్ పేరుతో రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. స్మార్ట్ ఫోన్లలోనే బుకి ంగ్ నిబంధనలు పెట్టడం రైతుల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లే కుండా సరిపడా యూరియా అందించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచేలా కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు. తక్షణమే యూరియా యాప్ విధానాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలని, లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, బీఆర్‌ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు రంజిత్ గౌడ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.


