ఎస్పీ శ్రీనివాస్‌రావు
హవేళిఘణాపూర్(మెదక్): పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాస్‌రావు సిబ్బ ందని ఆదేశించారు. సోమవారం మెదక్‌రూరల్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. స్టేషన్‌లో నమోదైన కేసుల వివ రాలు, పెండింగ్‌లో ఉన్న వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతీ ఫిర్యా దును బాధ్యతగా స్వీకరించి చట్టపరంగా విచారణ చేపట్టాలన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు, పేకాట, అక్రమ కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు మహేశ్, రాజశేఖర్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, ఎస్‌ఐ సుమన్ ఉన్నారు.


