మెదక్‌జోన్: వచ్చేనెల 12న మెదక్ కోర్టులో నిర్వహించబోయే లోక్‌అదాలత్‌లో అధిక సంఖ్యలో కక్షిదారులను రాజీ పడే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తెలిపారు. శనివారం కోర్టు ప్రాంగణంలో పోలీస్, రెవెన్యూ, ఎకై ్సజ్, అటవీ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లో ఆయాశాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసుల విషయంలో కక్షిదారులతో చర్చించి రాజీపడే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఫస్ట్ అడిషనల్ జిల్లా అండ్ సెషన్ జడ్జి ఆర్‌ఎం సుభవల్లి, జూనియర్ సివిల్ జడ్జి సాయిప్రభాకర్, డీఎస్పీలు ప్రసన్నకుమార్, డీఎస్పీ నరేందర్‌గౌడ్, డీఆర్‌ఓ అంబదాస్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


