సీపీఆర్‌పై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

సీపీఆర్‌పై అవగాహన అవసరం

Aug 23 2026 7:50 AM | Updated on Aug 23 2026 7:50 AM

ఎస్పీ శ్రీనివాసరావు

మెదక్‌జోన్‌: అత్యవసర సమయంలో సీపీఆర్‌ ఎంతో కీలకమని, ప్రతి పోలీస్‌కు దీనిపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం పోలీస్‌పరేడ్‌ గ్రౌండ్‌లో యూత్‌ ఫర్‌ సేవా ఆధ్వర్యంలో వైద్య నిపుణుల సహాయంతో ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. సీపీఆర్‌ చేసే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలను డెమో ద్వారా వివరించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులు నిత్యం ప్రజలతో మమేకమై విధులు నిర్వర్తిస్తారని, గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో సంఘటనా స్థలానికి ముందుగా చేరుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాంటి పరిస్థితుల్లో వెంటనే సీపీఆర్‌ అందించడం వల్ల సదరు వ్యక్తి బతికే అవకాశం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్‌, మెదక్‌ టౌన్‌ సీఐ మహేశ్‌, ఆర్‌ఐలు శైలేందర్‌, రామకృష్ణ, ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది, యూత్‌ ఫర్‌ సేవా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement