తీర్మానించిన కల్వకుంట గ్రామస్తులు
రామాయంపేట/నిజాంపేట(మెదక్): ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిజాంపేట మండలం కే.వెంకటాపూర్ తండాకు చెందిన భాస్కర్ శనివారం మృతి చెందడంతో తండాకు చెందిన వందలాది మంది కల్వకుంటలో రోడ్డుపైకి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రెండు గ్రామాలకు చెందిన ప్రజలు సమావేశమై చర్చించారు. మద్యం అమ్మకాలతో ఎన్నో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని, ఎందరో మృత్యువాత పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కల్వకుంటలో పూర్తిస్థాయిలో మద్యం అమ్మకాలను బంద్ చేయించాలని వారు డిమాండ్ చేశారు. కాగా, వెంకటాపూర్‌లో మద్యం అమ్మకాలు గతంలోనే బంద్ కాగా, కల్వకుంటలో 20కి పైగా బెల్ట్‌షాపుల్లో మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఇక నుంచి గ్రామంలో పూర్తిస్థాయిలో మద్యం అమ్మకాలు బంద్ చేయాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని సర్పంచ్ అందె కొండల్‌రెడ్డి హెచ్చరించారు. గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మకాలు కొనసాగిస్తే రూ. లక్ష జరిమానాతో పాటు కేసులు నమోదు చేయిస్తామన్నారు.


