వాహనదారులు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

వాహనదారులు సహకరించాలి

Aug 23 2026 7:50 AM | Updated on Aug 23 2026 7:50 AM

డీఎస్పీ నరేందర్‌గౌడ్‌

చేగుంట(తూప్రాన్‌): మండల కేంద్రంలోని మెదక్‌ రోడ్డు రైల్వే గేటు వద్ద ఆర్వోబీ పనులు సోమవారం నుంచి ప్రారంభమవుతాయని, వాహదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని తూప్రాన్‌ డీఎస్పీ నరేందర్‌గౌడ్‌ అన్నారు. శనివారం చేగుంట పోలీస్‌స్టేషన్‌లో ప్రజాప్రతినిధులు, వాహనదారులు, ప్రజలకు ఆర్వోబీ నిర్మాణ పనులపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనాలు, ఆటోలు వంటి చిన్న వాహనాలు వడియారం శివారులోని అండర్‌ బ్రిడ్జి నుంచి వెళ్లాలని సూచించారు. మెదక్‌ వెళ్లే పెద్ద వాహనాలు నార్సింగి మీదుగా, తూప్రాన్‌ నర్సాపూర్‌ మీదుగా వెళ్లడానికి సూచికల బోర్డులను ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. చిన్న వాహనాలకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నట్లు చెప్పారు. ఏడాదిన్నర కాలంగా నిర్మాణ పనులు జరగనున్నందున సమస్యలు ఉంటే పోలీసు సిబ్బందికి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో సీఐ సైదానాయక్‌, ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి, సర్పంచ్‌లు రాజ్యలక్ష్మి, సాయికుమార్‌గౌడ్‌ నాయకులు, వాహనదారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement