పరిశీలించి.. సూచనలు చేసి | - | Sakshi
Sakshi News home page

పరిశీలించి.. సూచనలు చేసి

Aug 23 2026 7:50 AM | Updated on Aug 23 2026 7:50 AM

పేటలో పర్యటించిన రాష్ట్ర మున్సిపల్‌ రీజినల్‌ డైరెక్టర్‌ స్వప్నారెడ్డి

పేటలో పర్యటించిన రాష్ట్ర మున్సిపల్‌ రీజినల్‌ డైరెక్టర్‌ స్వప్నారెడ్డి

రామాయంపేట(మెదక్‌): మున్సిపాలిటీ పరిధిలో పూర్తిగా శిథిలమైన ప్రధాన రహదారిని శనివారం రాష్ట్ర మున్సిపల్‌ రీజినల్‌ డైరెక్టర్‌ స్వప్నారెడ్డి పరిశీలించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లావణ్య, వైస్‌ చైర్‌పర్సన్‌ నవనీత, కమిషనర్‌ రవీందర్‌తో కలిసి పట్టణంలో కాలినడకన పర్యటించారు. రోడ్డు విస్తరణ కోసం తొలగించనున్న కట్టడాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. రహదారి విస్తరణ కోసం ఎమ్మెల్యే రోహిత్‌ నిధులు మంజూరు చేయించారని, అనుమతులు వచ్చిన తర్వాత పనులు ప్రారంభిస్తామని చైర్‌పర్సన్‌ వివరించారు. అనంతరం మెదక్‌– సిద్దిపేట రూట్‌లో చౌరాస్తా విస్తరణ పనులను పరిశీలించారు. ఆమె వెంట కౌన్సిలర్లు నాగరాజు, శ్యామల, రంజిత్‌, రవి, బైరం స్వప్న, మద్దెల మాధవి, శంకర్‌గౌడ్‌, పుట్టి సందీప్‌ ఇతర అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement