బియ్యం ధరలకు రెక్కలు | - | Sakshi
Sakshi News home page

బియ్యం ధరలకు రెక్కలు

Aug 23 2026 7:50 AM | Updated on Aug 23 2026 7:50 AM

● గగ్గోలు పెడుతున్న సామాన్యులు

పెరిగిన చక్కెర రేటు
● గగ్గోలు పెడుతున్న సామాన్యులు

జహీరాబాద్‌ టౌన్‌: సన్న బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. ఒక్కసారిగా పెరగడంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో సన్న బియ్యం కిలో రూ. 65 నుంచి రూ. 75 వరకు పలుకుతోంది. రకాలను బట్టి క్వింటాల్‌కు రూ. 5.500 వరకు పెరిగాయి. ప్రముఖ బ్రాండ్లు అయితే 26 కేజీల బస్తా రూ.1800 లోపు లభించడం లేదు. డిమాండ్‌ హెచ్చుతగ్గుల కారణంగా మధ్య తరగతి ప్రజలపై పెనుభారం పడుతోంది. సోనామసూరి, హెచ్‌ఎంటీ.కొలన్‌ తదితర సన్న బియ్యం ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సన్న బియ్యం కొనలేని, రేషన్‌ బియ్యం తినలేని పరిస్థితి నెలకొందని పలువురు వాపోతున్నారు. అలాగే చక్కెర ధరలు సైతం పెరిగాయి. మార్కెట్‌లో కిలో చక్కెర రూ. 65 దాటింది. నిత్యావసర సరుకులకు భారీగా ఖర్చువుతుండటంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement