లోక్‌ అదాలత్‌పై అవగాహన కల్పించండి | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌పై అవగాహన కల్పించండి

Aug 22 2026 7:13 AM | Updated on Aug 22 2026 7:13 AM

మెదక్‌ కలెక్టరేట్‌: జాతీయ లోక్‌ అదాలత్‌పై కక్షిదారులకు అవగాహన కల్పించి, ఎక్కువ మంది కేసుల్లో రాజీపడేలా కృషి చేయాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి సంతోష్‌కుమార్‌ న్యాయవాదులకు సూచించారు. శుక్రవారం మెదక్‌ కోర్టులో బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 12న జరిగే జాతీయ లోక్‌ అదాలత్‌లో అత్యధికంగా కేసులు రాజీపడేలా చర్యలు చేపట్టాలని కోరారు. లోక్‌ అదాలత్‌ ద్వారా కేసులను పరస్పర అంగీకారంతో త్వరగా పరిష్కరించుకోవచ్చని, తద్వారా కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో బార్‌ ప్రెసిడెంట్‌ జనార్దన్‌ రెడ్డి, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, ప్యానల్‌ న్యాయవాదులు, బ్యాంకులు, చిట్‌ ఫండ్‌ కంపెనీలకు చెందిన స్టాండింగ్‌, డిఫెండెంట్‌ కౌన్సిల్స్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement