మెదక్ కలెక్టరేట్: విద్యార్థి దశ నుంచే హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన తప్పనిసరిగా పెంచుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి గణేశ్వర్ పేర్కొన్నారు. మెదక్ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ గణేశ్వర్ మాట్లాడుతూ...ఈ నెల 12 నుంచి రెండు నెలల పాటు జిల్లాలో హెచ్‌ఐవీ అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, గ్రామీణ ప్రాంతాలు, యువజన కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలు, స్కోప్ ఎన్జీవో, లింక్ వర్కర్ ప్రాజెక్ట్, ఐసీటీసీ కౌన్సిలర్లు, డీఎస్‌ఆర్‌సీ కౌన్సిలర్లు, హెచ్‌ఐవీ విభాగానికి సంబంధించిన సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలని డీఎంహెచ్‌ఓ ఆదేశించారు. ఈ సందర్భంగా హెచ్‌ఐవీపై అవగాహన కల్పించే పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ కంట్రోల్ అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్ హరికృష్ణ, స్థానిక హైస్కూల్ హెచ్‌ఎం మల్లేశం, ఐసీటీసీ కౌన్సిలర్లు గోపి, సుధాకర్, రవి, లైంగిక వ్యాధుల కౌన్సిలర్ రాజేశ్వర్, స్కోప్ ఎన్జీవో ప్రతినిధి ఉప్పలయ్య, లింక్ వర్కర్ ప్రోగ్రాం ప్రతినిధులు లక్ష్మణ్, అనిల్, ఔట్రీచ్ వర్కర్లు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గణేశ్వర్


