పరిశీలించి.. సూచనలు చేసి
రామాయంపేట(మెదక్): దక్షిణ మధ్య రైల్వే భద్రతా కమిషనర్ మాధవి, డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోశ్‌కుమార్ వర్మ, చీఫ్ సేఫ్టీ అధికారి రమణారెడ్డి మంగళవారం జిల్లాలోని అక్కన్నపేట రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. ఈసందర్భంగా వారు స్టేషన్‌లో భద్రతాపరమై న చర్యలను పర్యవేక్షించారు. స్టేషన్ విస్తరణకు సంబంధించి మ్యాపును పరిశీలించి పలు సూచ నలు చేశారు. అక్కన్నపేట స్టేషన్ జంక్షన్‌గా రూపుదిద్దుకున్న సందర్భంగా సిగ్నలింగ్ వ్యవస్థను పరిశీలించారు. కాగా స్టేషన్‌లో అజంతా, రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లకు స్టాప్ ఇవ్వా లని కోరుతూ గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. వారివెంట ఆశాఖ పీఆర్వో శైలేంద్రకుమార్, స్టేషన్ మాస్టర్లు, ఇతర అధికారులు ఉన్నారు.


