పేదల కడుపు కొడుతున్న బీజేపీ
నర్సాపూర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పేదల కడుపు కొట్టి ధనికుల కొమ్ము కాస్తుందని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి ఆరోపించారు. జాతీయ ఉపాధి హామీ పథకం పేరును కేంద్రం మార్పు చేసినందుకు గాను కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు ఆదివారం పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టే ఉద్యమాల్లో ఇది ఆరంభమేనని అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని తొలగించే కుట్రలో భాగంగా ప్రస్తుతం పనిదినాలు తగ్గించిందని ఆరోపించారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు రిజ్వాన్, మల్లేష్, చిన్న అంజిగౌడ్, అశోక్‌గౌడ్, లలిత, హబీబ్‌ఖాన్, సుధీర్‌గౌడ్, తరుణ్, సుదర్శన్‌గౌడ్, నగేశ్, సురేశ్, రషీద్, మల్లేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్


