కోహీర్.. గజగజ
రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండల కేంద్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 5.0 డిగ్రీలు నమోదైంది. జహీరాబాద్ మండలం అల్గోల్‌లో 5.8, ఝరాసంగంలో 6.8 డిగ్రీలు నమోదయ్యాయి. ఏటా చలికాలంలో కోహీర్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తోంది. ఆదివారం జహీరాబాద్ మండలం సత్వార్‌లో 7.5, మొగుడంపల్లిలో 7.5, కోహీర్ మండలం దిగ్వాల్ 8.1, కంగ్టిలో 8.1 డిగ్రీలు, న్యాల్‌కల్‌లో 8.4, నిజాంపేట్‌లో 8.4, సదాశివపేట 8.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. – జహీరాబాద్


