మెదక్ కలెక్టరేట్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని తపస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో సీపీఎస్ రద్దు చేయాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఇందులో భాగంగా అన్ని మండలాల తహసీల్దార్లకు వినతిపత్రం అందజేశారు. అలాగే జిల్లా కేంద్రంలోని మెదక్‌లో కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. 2004 సెప్టెంబర్ 1 నుంచి అమలవుతున్న సీపీఎస్ విధా నాన్ని, నూతనంగా ఏర్పాటైన రాష్ట్రంలో కూడా కొనసాగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా బాధ్యులు రాజేశ్వర్, శ్రీధర్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, సురేందర్, నర్సింలు, భిక్షపతి, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
శాంతించిన మంజీరా
పాపన్నపేట(మెదక్): తొమ్మిది రోజులుగా మంజీరా నీటిలో మునిగిన ఏడుపాయల దుర్గమ్మ ఆలయ బ్రిడ్జి శనివారం తేలింది. వరుసగా మంజీరా ప్రవాహం కొనసాగుతుండటంతో ఆలయ ప్రాంగణం గడ్డి, నాచుతో నిండిపోయింది. దీంతో అమ్మవారి ఆలయ పరిసరాలను సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. అయితే ఆ దివారం సింగూరు నీటి వరద పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని ఇరిగేషన్ ఏఈ సతీశ్ తెలిపారు. ఈనెల 14 నుంచి సింగూరు నీటి విడుదలతో దుర్గమ్మ ఆలయం జల దిగ్బంధంలో కొనసాగింది.
బోధన మెరుగుపర్చుకోవాలి
చిన్నశంకరంపేట(మెదక్): ప్రాథమిక పాఠశాలలో బోధిస్తున్న ఉపాధ్యాయులు తమ బోధన తీరును మరింత మెరుగు పర్చుకోవాలని డీఈఓ రాధాకిషన్ సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఉపాధ్యాయుల బోధనను పరిశీలించారు. ఈసందర్భంగా టీఎల్‌ఎం విధానంలో విద్యా బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈసందర్భంగా ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న భవిత కేంద్రాన్ని పరిశీలించారు. హెచ్‌ఎం శ్రీనివాస్‌రెడ్డికి పలు సూచనలు చేశారు.
సమతుల ఆహారం మేలు
నర్సాపూర్ రూరల్: సమతుల ఆహారంతోనే ఆరోగ్యం బాగుంటుందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్ భాస్కరాచారి, తునికి కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్ అన్నారు. శనివారం డంగోరియా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోషకాహారం, సేంద్రియ సాగుపై మండలంలోని చిన్నచింతకుంటలో గర్భిణులు, బాలింతలు, రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఎక్కువ పోషకాలు కలిగిన చిరు ధాన్యాలు, ఆకుకూరలు, పప్పు ది నుసులు తీసుకోవాలని సూచించారు. రైతులు సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేయా లని పేర్కొన్నారు. కార్యక్రమంలో డంగోరియా చారిటబుల్ ట్రస్ట్ సీనియర్ ఇన్వెస్టిగేటర్ పీవీవీఎస్ మూర్తి, ప్రాజెక్ట్ అసిస్టెంట్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
‘సమయపాలన తప్పనిసరి’
కౌడిపల్లి(నర్సాపూర్): కౌడిపల్లి ఎంపీడీఓ కార్యాలయాన్ని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ల పనితీరును పరిశీలించారు. ఆన్‌లైన్ సేవలపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని ఆదేశించారు.
ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి: తపస్
ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి: తపస్
ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి: తపస్