
సృష్టిలో మనిషికి మనిషే తోడు. సేవాభావంలోను సాయపడటంలోనే మ
వివరాలు 8లో
రెండు సీజన్ల నుంచి పెండింగ్
2024– 25 ఖరీఫ్, రబీ సీజన్‌లకు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించిన సంస్థలకు రూ.19,53,30,335 కమీషన్ బకాయి ఉన్నాయి. 2024 ఖరీఫ్‌లో మొత్తం 391 కేంద్రాలు ఉండగా, అందులో ఐకేపీ 107, పీఏసీఎస్ 259, డీసీఎంఎస్ 8, ఎఫ్‌పీఓలు 17 కేంద్రాలు కలిసి 2,91,263 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాయి. ఇందుకు సంబంధించి రూ. 9.32 కోట్ల కమీషన్ రావాల్సి ఉంది. 2024 రబీలో మొత్తం 384 కేంద్రాలు ఉండగా, అందులో ఐకేపీలు 144, పీఏసీఎస్‌లు 209, డీసీఎంఎస్‌లు 8, ఎఫ్‌పీఓలు 23 కలిసి 3,19,144 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాయి. ఇందుకు సంబంధించి రూ. 10.21 కోట్ల కమీషన్ రావాల్సి ఉంది. వీటిని సాధ్యమైనంత త్వరగా చెల్లించాలని సంబంధిత సంస్థలు కోరుతున్నాయి.
మెతుకుసీమ ఉమ్మడి జిల్లాకు ధాన్యాగారంగా పేరు గాంచింది. జిల్లాలో మంజీరా పరివాహాక ప్రాతం.. ఘనపురం ఆనకట్ట.. పెద్ద సంఖ్యలో చెరువులు, కుంటలు ఉండటంతో మెజార్టీ రైతులు వరి పంటనే సాగు చేస్తున్నారు. కాగా దళారుల నుంచి రక్షణ కల్పించి రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు గత కొన్నేళ్లుగా కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుంది. ఐకేపీ మహిళా సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీసీఎంఎస్‌లు, ఎఫ్‌పీఓల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. వీరికి నిర్వహణ ఖర్చులు, కమీషన్ల రూపంలో క్వింటాల్‌కు రూ. 33 చెల్లిస్తున్నారు.
నెల రోజుల్లో చెల్లింపులు
గత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కమీషన్ బకాయిలు నెల రోజుల్లో చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటాం. రబీకి సంబంధించి రీకన్సిలేషన్ చివరి దశలో ఉ ంది. అది అయిపోయాక, కమీషన్ చెల్లిస్తాం. హమాలీల ఖర్చు చెల్లింపులో ఆడిట్ అభ్యంతరాలు ఉన్నందున అవకాశాలు లేవు. – జగదీశ్‌కుమార్, సివిల్ సప్లై డీఎం