
అమ్మ.. డాక్టర్లు ఉంటున్నారా..?
చిన్నశంకరంపేట(మెదక్): అమ్మ.. డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారా..? అవసరమైన మందులు అందిస్తున్నారా..? అంటూ కలెక్టర్ రాహుల్‌రాజ్ నార్సింగి ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. శనివారం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా మందులను పరిశీలించడంతో పాటు ల్యాబ్, టీకాలు, ప్రసూతి గదిని, డ్రెస్సింగ్ రూంను పరిశీలించారు. అస్పత్రిలో ఉన్న రోగులతో మాట్లాడి వైద్య సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షకాలం సీజనల్‌లో వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు అవసరమైన మందులు అందించాలన్నారు. ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ మేరకు మెడికల్ ఆఫీసర్ రవికుమార్‌కు పలు సూచనలు చేశారు. అనంతరం నర్సంపల్లిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారులు సకాలంలో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మేరిగ్రేసి, ఎంపీడీఓ ఆనంద్‌కుమార్, సిబ్బంది ఉన్నారు.
మట్టి విగ్రహాలను పూజిద్దాం
మెదక్ కలెక్టరేట్: మట్టి వినాయక విగ్రహాలను పూజిస్తూ.. పర్యావరణాన్ని పరిరక్షిద్దామని కలెక్టర్ రాహ ల్‌రాజ్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టర్‌లో కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర కార్యాలయం రూపొందించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించి మా ట్లాడారు. సహజ రంగులతో తయారు చేసిన మట్టి విగ్రహాలను పూజించాలన్నారు.
అవసరమైన మందులు ఇస్తున్నారా?
నార్సింగి ప్రభుత్వ ఆస్పత్రిలో
రోగులతో మాట్లాడిన కలెక్టర్