
పరిశుభ్రతతోనే ఆరోగ్యం
టేక్మాల్(మెదక్): ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో సులభ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్‌బీఎం, గ్రామ పంచాయతీ నిధులు రూ. 3 లక్షలతో సులభ్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. పరిసరాలు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుందన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ తులసీరాం, ఎంపీడీఓ రియాజొద్దీన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేశ్, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వీరప్ప, మాజీ వైస్ ఎంపీపీ మల్లారెడ్డి, ఈఓ రాకేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎరువుల డీలర్లకు నోటీసులు
రామాయంపేట(మెదక్): యూరియాతో లింకుపెట్టి ఇతర ఎరువులను రైతులకు అంటగడుతున్న ఇద్దరు ఎరువుల డీలర్లకు శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పట్టణంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంతో పాటు మన రైతు బజార్ ఎరువుల దుకాణాల్లో కొంతకాలంగా యూరియాతో పాటు ఇతర ఎరువులను బలవంతంగా రైతులకు అంటగడుతున్నారు. ఈమేరకు జిల్లా ఉన్నతాధికారులకు సమాచా రం అందగా, కలెక్టర్ ఆదేశాల మేరకు ఇద్దరు వ్యాపారులకు ఏడీఏ రాజ్‌నారాయణ నోటీస్‌లు అందజేశారు.
మెరుగైన వైద్యం అందించాలి
నిజాంపేట(మెదక్): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ శుక్రవారం సందర్శించారు. రికార్డులను పరిశీలించి, ఆస్పత్రిలో మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట వైద్య సిబ్బంది, ఆశావర్కర్లు ఉన్నారు.
కేంద్రం తీరుతోనే
యూరియా కొరత
నర్సాపూర్: కేంద్ర ప్రభుత్వ చర్యలతోనే యూరియా కొరత ఏర్పడిందని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ ఆరోపించారు. శుక్రవారం స్థానిక పీఏసీఎస్‌లో యూరియా అమ్మకాలను పరిశీలించి రైతులతో మాట్లాడా రు. యూరియా కోసం ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. సకాలంలో యూరియా అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసు కుంటుందన్నారు. జిల్లాలో అవసరం మేరకు యూరియా సరఫరా చేయాలని అధికారులతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. కాగా యూరి యా కోసం గల్లీలో కాదని, ఢిల్లీలో ధర్నాలు చేయాలని టీఆర్‌ఎస్ నాయకులకు హితవు పలికారు. అవగాహన లేకుండా రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
నేడు డయల్ యువర్ డీఎం
మెదక్ మున్సిపాలిటీ: మెదక్ ఆర్టీసీ డిపోలో శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ సురేఖ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు 7842651592 నంబర్‌కు ఫోన్ చేసి తమ తమ సమస్యలు తెలపాలని ఆమె సూచించారు.

పరిశుభ్రతతోనే ఆరోగ్యం

పరిశుభ్రతతోనే ఆరోగ్యం

పరిశుభ్రతతోనే ఆరోగ్యం