
జిల్లాలో పోలీస్‌యాక్ట్ మెదక్ మున్సిపాలిటీ: జిల్లావ్యా
టీచర్ల పదోన్నతుల
ప్రక్రియ షురూ
● జిల్లాకు 25 మంది
గెజిటెడ్ హెచ్‌ఎంలు
● 26న స్కూల్ అసిస్టెంట్ల ప్రమోషన్లు
పాపన్నపేట(మెదక్): టీచర్ల పదోన్నతుల ప్రక్రియ మొదలైంది. గతంలో కోర్టు స్టేతో వాయిదా పడిన పదోన్నతులు, తీర్పు వచ్చిన మరునాడే ప్రారంభమయ్యాయి. ఈ మేరకు గురువారం జిల్లాలో 25 మంది గెజిటెడ్ హెచ్‌ఎంలుగా ప్రమోషన్ ఉత్తర్వులు పొందారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో ఇద్దరు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు 23 మంది ఆప్షన్ ఇచ్చారు. కాగా స్కూల్ అసిస్టెంట్ సమాన స్థాయి ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈనెల 24 వరకు సీనియారిటీ జాబితా తయారవుతోంది. సోమవారం వెబ్ ఆప్షన్లు, మంగళవారం ప్రమోషన్లు ఇచ్చి పాఠశాలలకు అలాట్ చేయనున్నారు. సుమారు 180 మంది సీనియర్ ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలుగా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సీనియారిటీ జాబితా తుది దశలో ఉందని పేర్కొన్నారు.