ఉమ్మడి జిల్లాలో
రూ. కోట్లలో
వ్యాపారం
● గత ఎకై ్సజ్ ఏడాది 12,227 దరఖాస్తులు
● రూ. 244.54 కోట్ల ఆదాయం
● ఈసారి మరింత పెరిగే అవకాశం
మెదక్ అర్బన్: కొత్త మద్యం విధానాన్ని ఖరారు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయడంతో వ్యాపారుల్లో కదలిక ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలో లిక్కర్ వ్యా పారం మూడు క్వార్టర్లు.. ఆరు బీర్లుగా కొనసాగుతోంది. రోజురోజుకు పె రుగుతున్న వినియోగం సర్కారుకు కనకవర్షం కురిపిస్తోంది. ఈసారి వైన్‌షాపు దరఖాస్తు ధర పెంచడంతో భారీ ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో 243 వైన్ షాపులు ఉండగా, 2023– 25 ఎక్సైజ్ సంవత్సరానికి 12,227 దరఖాస్తులు వచ్చాయి. ఈ మేరకు రూ. 244.54 కోట్ల ఆదాయం కేవలం అప్లికేషన్ల ద్వారానే సమకూరింది. కాగా ఘనపూర్ ఐఎంఎల్ డిపో నుంచి ఇప్పటివరకు సుమారు రూ. 2,490 కోట్ల మద్యం కొనుగోలు చేశారు. ఇదిగాక వైన్ షాపుల నుంచి ప్రభుత్వం వసూలు చేసే లైసెన్స్ రుసుము, టర్నోవర్ టాక్స్, ఎకై ్సజ్ టాక్స్ అదనం.
ఉమ్మడి జిల్లాలో 243 వైన్ షాపులు
ఉమ్మడి జిల్లాలో 243 ఏ4 వైన్‌షాపులు ఉన్నాయి. 2023– 25 ఎకై ్సజ్ సంవత్సరానికి సంగారెడ్డి జిల్లాలో 6,156, మెదక్‌లో 1,905, సిద్దిపేటలో 4,166 దరఖాస్తులు వచ్చాయి. అప్పట్లో అప్లికేషన్ రుసుం రూ. 2 లక్షలు ఉండేది. ఈ లెక్కన కేవలం దరఖాస్తుల రూపేణ రూ. 244.50 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి దరఖాస్తు ధర రూ. 3 లక్షలకు పెంచడంతో సుమారు రూ.120 కోట్ల ఆదాయం అదనంగా పెరిగే అవకాశం ఉంది.
ఘనపూర్ ఐఎంఎల్ డిపో నుంచి..
మెదక్, సంగారెడ్డి జిల్లాలలోని 118 వైన్ షాపులు, 16 బార్లకు మెదక్ జిల్లా ఘనపూర్ ఐఎంఎల్ డిపో నుంచి మద్యం, బీర్లు సరఫరా అవుతాయి. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు సుమారు రూ. 2,490 కోట్ల విలువ గల మద్యం కొనుగోలు చేశారు. ఇందులో 26,40,682 కార్టన్ల లిక్కర్, 34,34,238 కార్టన్ల బీర్‌లు కొనుగోలు చేశారు. గత ఎకై ్సజ్ సంవత్సరం వ్యవధి సుమారు 100 రోజులు మిగిలి ఉంది. వచ్చే ఎకై ్సజ్ సంవత్సరం స్థానిక సంస్థల ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నందున, ఈ ఏడాది వైన్ షాపులకు దరఖాస్తులు మరిన్ని ఎక్కువ గా వచ్చే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం మద్యం దుకాణాలు నడుపుతున్న యజమానులు, గతంలో టెండర్ వేసి షాపులు దొరకని వ్యాపారులు, ఇప్పటి నుంచే గ్రూపులు, సిండికేట్లుగా ఏర్ప డి టెండర్లలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో వైన్‌షాపుల వివరాలు
మెదక్ 49
సిద్దిపేట 93
సంగారెడ్డి 101