
పల్లెలు మురిసేలా.. పనుల జాతర
తూప్రాన్: పల్లెలు మురిసేలా.. పనుల జాతరకు శ్రీకారం చుట్టామని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. శుక్రవారం మండలంలోని ఇస్లాంపూర్, వెంకటరత్నాపూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు డీఆర్డీఓ శ్రీనివాస్‌రావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్యతో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈసందర్భంగా ఆయన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రూ. 20.60 కోట్లతో 3,238 పనులు చేపట్టామని వివరించారు. ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించి గ్రామాల అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు పనుల జాతరకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. అనంతరం పంచాయతీ ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రతి మండలంలో అధికారులు సమన్వయంతో పనిచేసి పనుల జాతరను విజయవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాలో 492 గ్రామ పంచాయతీల్లో భూమి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం నానో ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. జిల్లాలో యూరియా కొరత లేదని స్పష్టం చేశారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్