
ప్రభుత్వ బడుల్లోసౌకర్యాలు కరువు
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్
నర్సాపూర్ రూరల్: పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేశ్‌గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని రుస్తుంపేట మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను నాయకులతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయటకు వెళ్తున్నారని వాపోయారు. మధ్యాహ్న భోజనం కోసం డైనింగ్ హాల్, నీటి సౌకర్యంతో పాటు పాఠశాలలో అసంపూర్తిగా వదిలేసిన పనులను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. అసంపూర్తి పనులపై కాంట్రాక్టర్‌ను సంప్రదించగా, బిల్లులు రాకపోవడంతో పనులు పూర్తి చేయలేకపోయినట్లు చెప్పాడు. వెంటనే మెదక్ ఎంపీ రఘునందన్‌రావుకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించేందుకు చర్య లు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణ రెడ్డి, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు గుండం శంకర్, మండలాధ్యక్షుడు చంద్రయ్య, శ్రీకాంత్‌చారి, సంజీవరెడ్డి, రాజేశ్, రాజేశ్‌గౌడ్ తదితరులు ఉన్నారు.