
భావితరాల కోసం మొక్కలు నాటాలి
మెదక్ మున్సిపాలిటీ: భవిష్యత్ తరాల సంక్షేమమే వన మహోత్సవం లక్ష్యమని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా పోలీసులు ముందుండాలని పిలుపునిచ్చారు. అన్ని పోలీస్‌స్టేషన్లలో 18,000 మొక్కలు నాటాలని ఆదేశించారు. అలాగే సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మొక్కలు నాటి, సంరక్షించాల న్నారు. ప్రకృతికి అందం మొక్కలేనని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్నకుమార్, సుభాష్ చంద్రబోస్, రంగనాథ్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్ గౌడ్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ సందీప్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు