
డైట్‌కు కొత్త సొబగులు
ఆధునిక సౌకర్యాలకు రూ. 11.14 కోట్లు మంజూరు వేధిస్తున్న బోధకుల కొరత
మెదక్ అర్బన్: డైట్ కళాశాల సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌గా ఎంపికై ంది. రాష్ట్రంలో కరీంనగర్, మెదక్ డైట్ కళాశాలలకు ఈ అవకాశం దక్కింది. కాలేజీలో ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు రూ. 11,14,60,000 కోట్లు మంజూరు చేస్తూ సమగ్ర శిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా భావి భారత భాగ్య విధాతలను తయారు చేసే ఛాత్రోపాధ్యాయులు మాత్రం అనేక సమస్యలతో సతమవుతున్నారు. కళాశాలలో 35 మంది లెక్చరర్లు ఉండాల్సి ఉండగా, రెగ్యులర్ లెక్చరర్లు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. ము గ్గురు టీచర్లు డిప్యుటేషన్.. 15 మంది గెస్ట్ లెక్చరర్లుగా సేవలందిస్తున్నారు.
రెగ్యులర్ స్టాఫ్ నిల్.. గెస్ట్‌లతో సరి
జిల్లా కేంద్రమైన మెదక్‌లో బేసిక్ సెంటర్‌గా ఉన్న శిక్షణా కేంద్రం, 1972లో డైట్ కళాశాలగా మారింది. అనంతరం 1989లో ఘనపూర్ శివారులో కొత్త భవనం నిర్మించారు. ఇక్కడ డీఈడీతో పాటు డీపీఎస్‌ఈ కోర్సులుండగా, మొత్తం 220 సీట్లు ఉన్నాయి. మొత్తం 35 మంది లెక్చరర్లతో పాటు ప్రిన్సిపాల్ ఉండాలి. కానీ ప్రిన్సిపాల్ ఇటీవల రిటైర్ కాగా, డీఈఓ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. లెక్చరర్ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. దీంతో ముగ్గురు టీచర్లు డిప్యుటేషన్‌పై, 15 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. రెగ్యులర్ స్టాఫ్ లేక ఛాత్రోపాధ్యాయులు అనేక ఇబ్బంది పడుతున్నారు.
బోధనకు ఆటంకం కల్పించం
డైట్ కాలేజీలో రెగ్యులర్ స్టాఫ్ లేకపోయినప్పటికీ, ముగ్గురు టీచర్లను డిప్యుటేషన్‌పై తీసుకున్నాం. 15 మంది గెస్ట్ ఫ్యాకల్టీగా తీసుకొని బోధనకు ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌గా మెదక్ డైట్ కళాశాల ఎంపిక కావడం సంతోషం. దీంతో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. – రాధాకిషన్, డీఈఓ,
ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డైట్
సౌకర్యాలు ఇలా..
మెదక్ డైట్ కళాశాలలో ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు రూ. 11.14 కోట్లు మంజూ రయ్యాయి. ఇందులో అదనపు క్లాస్ రూంలు, ఆడిటోరియం, కంప్యూటర్ రూంలు, లేబరేటరీ, లైబ్రరీ, రీసెర్చ్ ఇన్నోవేషన్ సెంటర్, సెమినార్ హాల్, స్పెషల్ ఎడ్యుకేషన్ యూనిట్‌ల నిర్మాణం కోసం రూ. 5,42,10,000 కోట్లు, రెసిడెన్షియల్ హాస్టల్స్ బాలురు, బాలికల కోసం రూ.1.60 కోట్లు, టాయిలెట్స్ రూ. 59.50 లక్షలు, భద్రతా పరమైన సౌకర్యాలకు రూ.36 లక్షలు, సిబ్బంది క్వార్టర్స్‌కు రూ. 55 లక్షలు, క్యాంటీన్, బోర్‌వెల్, తాగు నీరు, పార్కింగ్, వర్షపు నీటి హార్వెస్టింగ్ తదితర సౌకర్యాల కోసం రూ. 2.62 కోట్లు మంజూరయ్యాయి.
సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా మెదక్ కళాశాల

డైట్‌కు కొత్త సొబగులు