
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
పాపన్నపేట(మెదక్): మండలంలోని మిన్‌పూర్ 132 కేవీ సబ్‌స్టేషన్‌లో అత్యవసర మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ మోహన్‌బాబు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సబ్‌స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
గడువులోగా పూర్తి చేయాలి
మెదక్ కలెక్టరేట్: C¯ŒS-OòÜ-µÆŠ‡ ¯éÑ$-¯ól-çÙ-¯]lϯ]l$ VýSyýl$-Ð]l#-ÌZç³# ç³NÇ¢ ^ólĶæ*ÌS° yîlDK Æ>«§é-MìS-çÙ¯ŒS G…D-KË$, òßæ^Œl-G…ÌS¯]l$ B§ól-Õ…-^éÆý‡$. VýS$Æý‡$ ÐéÆý‡… Ð]lÆý‡$aÐ]lÌŒæ ç³§ýl®-†ÌZ AÐ]l-V>-çßæ¯]l ÐéÇMìS MýSÍ-µ…-^éÆý‡$. ѧéÅ-Æý‡$¦ÌS ¯éÑ$-¯ól-çÙ-¯]lϯ]l$ òÜò³-t…-ºÆŠ‡ 15Ð]l ™ól©-ÌZV> A‹³ÌZyŠæ ^ólĶæ*-ÌS¯é²Æý‡$. D ÑçÙ-Ķæ$…ÌZ òßæ^ŒlG…Ë$ {ç³™ólÅMýS ^öÆý‡Ð]l ^èl*´ë-ÌS-¯é²Æý‡$. A‹³ÌZyŠæ ^ólíܯ]l {´ëgñæ-MýS$tÌS¯]l$ yìl´ë-ÆŠ‡t-Ððl$…sŒæ B‹œ OòܯŒSÞ A…yŠæ sñæM>²-ÌS-i, ¯ólçÙ¯]lÌŒæ C¯ø²-ÐólçÙ¯ŒS ¸û…-yól-çÙ¯ŒS °ç³#-׿$Ë$ ç³Ç-Ö-Í…_ E™èl¢-Ð]l$-OÐðl$¯]l {´ëgñæMýS$t-ÌSMýS$ 10 ÐólË$ A…§ýl-gôæÝë¢Æý‡° ™ðlÍ-´ëÆý‡$. çÜ…§ól-à-Ë$…sôæ 8328599157 ¯]l…ºÆŠḥÌZ çÜ…{ç³-¨…^éÌS° çÜ*_…^éÆý‡$. M>Æý‡Å-{MýSÐ]l$…ÌZ hÌêÏ Ð]l*°-r-Ç…VŠæ A«¨M>Ç çÜ$§ýlÆý‡Ø-¯]l-Ð]lÊ-Ç¢, hÌêÏ OòܯŒSÞ A«¨ M>Ç Æ>h-Æð‡yìlz, HG‹ÜK ¯]lÒ¯ŒS ´ëÌŸY-¯é²Æý‡$.
నేడు డిగ్రీ కళాశాలలో సెమినార్
మెదక్‌మున్సిపాలిటీ: శుక్ర, శనివారం మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేషనల్ సెమినార్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ హుస్సేన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాల పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం కోఆర్డినేటర్ సురేందర్ ఆధ్వర్యంలో ఈ గవర్నెన్స్, ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్, వికాస్ భారత్ వివిధ అంశాలపైన ప్రత్యేకంగా సెమినార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రేపు పాఠశాలల్లో నిరసన
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్ విధా నం అమలు చేయాలని తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్ డిమాండ్ చేశారు. గురువారం వారు మెదక్‌లో మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం అన్ని పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపనున్నట్లు తెలిపా రు. అనంతరం తహసీల్దార్లకు, కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేస్తామని చెప్పారు. జిల్లాలోని తపస్ నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయా లని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షు డు నర్సింలు, నాయకులు శ్రీధర్‌రెడ్డి, మెదక్, కొల్చారం, నార్సింగి మండలాల అధ్యక్షులు నరేందర్, సిద్దు, స్వామి పాల్గొన్నారు.
జిల్లా ఖజానా శాఖ
ఏడీగా అనిల్‌కుమార్
మెదక్ కలెక్టరేట్: జిల్లా ఖజానా శాఖ సహాయ సంచాలకుడిగా అనిల్ కుమార్ మరాటి గురువారం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు కలెక్టర్ రాహుల్‌రాజ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈసందర్భంగా అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. ట్రెజ రీ కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బందితో కలిసి సమన్వయంగా విధులు నిర్వర్తిస్తానని తెలిపారు.
జోరు తగ్గిన మంజీరా
పాపన్నపేట(మెదక్): వారం రోజులతో పోలిస్తే గురువారం మంజీర నది వరద జోరు తగ్గింది. అయినా దుర్గమ్మ ఆలయం వరదల్లోనే కొనసాగుతోంది. ఘనపురం ఆనకట్టపై నుంచి 42,800 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. నది వైపు పర్యాటకులు, భక్తులు వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం నాటికి ప్రవాహం మరింత తగ్గుతుందని భావిస్తున్నారు.