
సీజనల్‌పై అప్రమత్తంగా ఉండాలి
డీఎంహెచ్‌ఓ శ్రీరామ్
నర్సాపూర్ రూరల్/నర్సాపూర్: గ్రామస్థాయిలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి రోగులకు వైద్య సహాయం అందించాలని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం మండలంలోని మూసాపేటలో వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని ఆయా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటితో ఇబ్బందులు పడుతున్న వారు వెంటనే గ్రామస్థాయిలోని వైద్య సిబ్బందిని సంప్రదించి వైద్య సహాయం పొందాలన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. అంతకుముందు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకొని తగిన వైద్యం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సృజన, ప్రో గ్రాం ఆఫీసర్లు హరిప్రసాద్, నవ్య పాల్గొన్నారు.