
సరిపడా యూరియా అందించాలి
నర్సాపూర్/చిలప్‌చెడ్: రైతులకు సరిపడా యూ రియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. గురువారం నర్సాపూర్, చిలప్‌చెడ్ మండలాల పరిధిలో రైతులు నిర్వహించిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. యూరియా కొరత లేదంటూ అధికారులు మభ్యపెట్టడం సరికాదన్నారు. కేసీఆర్ హయాంలో ముందస్తు అంచనాలతో ఎరువులు సిద్ధం చేసేవారన్నారు. ఇప్పటికై నా యూ రియా కొరత తీర్చకపోతే పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఆశోక్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, నాయకులు దుర్గారెడ్డి, రాంచంద్రారెడ్డి, రాజిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ధర్మారెడ్డి, శేఖర్, సత్యంగౌడ్, భిక్షపతి, శ్రీనివాస్‌రెడ్డి, ప్రసాద్, సుధాకర్‌రెడ్డి, సద్దాం తదితరులు పాల్గొన్నారు.

సరిపడా యూరియా అందించాలి