
విద్యార్థులకు నాణ్యమైన విద్య
జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీశ్
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ పాఠశాలల ద్వారా విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా బీసీ సంక్షేమ అధికా రి జగదీశ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో బీసీ బాలికల హాస్టల్‌ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా విద్యార్థినులకు అందిస్తున్న ఆహార నాణ్యత, తాగునీరు, తరగతి గదులు, వంటశాల, రిజిస్టర్లు, పరిసరాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వసతి గృహాల్లో విద్యార్థినులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. అలా గే వారికి నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. సద్వినియోగం చేసుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు.