
బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025
న్యూస్‌రీల్
24 ప్రాంతాల్లో శిథిలం రాకపోకలకు తీవ్ర అంతరాయం తాత్కాలిక మరమ్మతులకు రూ.1.63 కోట్లతో ప్రతిపాదనలు
భారీ వర్షాలతో జిల్లాలో రోడ్లు పూర్తిగా
ధ్వంసమయ్యాయి. కొన్నిచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శిథిల రోడ్లపై ప్రయాణం చేయాలంటేనే జనం జంకుతున్నారు. 25 ప్రాంతాల్లో 44 కి.మీ రోడ్డు
శిథిలమవగా.. ఐదు చోట్ల 620 మీటర్ల రోడ్డు
కొట్టుకుపోయింది. రోడ్లు భవనాల శాఖ
అధికారులు నష్ట అంచనాల తయారీలో నిమగ్నమయ్యారు. తాత్కాలిక మరమ్మతులకు సుమారు రూ.1.63 కోట్లు, శాశ్వత
మరమ్మతులకు రూ.48.93 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు.
మెదక్ అర్బన్:
భారీ వర్షాలతో మెతుకుసీమ వణికి పోతోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరదల ఉధృతికి పలు చోట్ల రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. మెదక్– బొడ్మట్ రోడ్డులో బొడ్మట్‌పల్లి వద్ద 150 మీటర్ల రోడ్డు కోతకు గురైంది. నార్సింగి నుంచి శంకరంపేట వెళ్లే దారిలో 13 కి.మీ దూరంలో 200 మీటర్ల రోడ్డు ధ్వంసమైంది. కొత్తపల్లి –చింతకుంట దారిలో ఎలకుర్తి వద్ద 120 మీటర్లు, శివ్వంపేట మండలం చంది–కానుకుంట రోడ్డులో నవాబ్‌పేట వద్ద 20 మీటర్లు, పిల్లికోటాల్–చంది మార్గంలో పోతులబోగుడ వద్ద 30 మీటర్ల రోడ్డు కొట్టుకుపోయింది. టేక్మాల్ మండలం ధన్నూర, ఎలకుర్తి వద్ద రెండు చోట్ల వంతెనలు నిర్మించాల్సిన అవసరం ఉంది. గుండు వాగు ఉధృతికి ఈ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి.
పీఆర్ రోడ్ల మరమ్మతు కోసం రూ.40 లక్షలు
పంచాయతీరాజ్ రోడ్ల తాత్కాలిక మరమ్మతుల కోసం సుమారు రూ.40 లక్షలతో అంచనాలు పంపి నట్లు ఈఈ నర్సింలు తెలిపారు. హవేళిఘనపూర్ మండలం ధూప్‌సింగ్ తండాకు వెళ్లే దారిలో గంగ మ్మ వాగు వంతెన రోడ్డు కోసుకుపోయి ఇబ్బంది కరంగా మారింది. రాజ్‌పేట–కొత్తపల్లి మధ్య రోడ్డు ధ్వంసమైంది. పాతూర్–మోటకాడి తండా నిర్మా ణం కోసం వేసిన కంకర ప్రయాణికుల పాలిట సమస్యగా మారింది. టేక్మాల్ మండలం సాలోజిపల్లి వంతెన, మల్కాపూర్ వంతెన శిథిలమయ్యా యి. శివ్వంసేట మండలం రాజన్నవాగు వంతెన, చిన్నగొట్టిముక్కుల చాకరిమెట్ల ఆలయం వద్ద రోడ్డు దెబ్బతిన్నది. అల్లాదుర్గం మండలం వెంకట్‌రావుపేట, రేగోడ్ రోడ్డులో సమస్యలు ఏర్పడ్డాయి.
త్వరలో పనులు ప్రారంభిస్తాం: డీఈఈ
వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం తక్షణ చర్యలు చేపడతామని డీఈఈ సర్ధార్ సింగ్ తెలిపారు. తక్షణ మరమ్మతుల కోసం రూ.1.63 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశాం. వెంటనే రాకపోకలు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. భారీ వర్షాలతో వరదల ఉధృతి ఎక్కువగా ఉండటంతో రోడ్లు ధ్వంసమయ్యాయి.
భారీ వర్షాలకు టేక్మాల్ మండలం చల్లపల్లి గ్రామానికి వెళ్లే ఈ రోడ్డు సగానికి కోసుకుపోయింది.
తారు కొట్టుకుపోయి కంకర తేలింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ద్విచక్ర
వాహనాలు మినహా ఇతర వాహనాలు వెళ్లడం లేదు. ఇది చల్లపల్లిలోనే కాదు.. జిల్లాలో
చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి నెలకొంది. – టేక్మాల్(మెదక్)

బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025