
తక్షణమే మరమ్మతులు
హల్దీ ప్రాజెక్టు సందర్శన
గంగమ్మతల్లికి పూజలు
● ఆర్‌అండ్‌బీ అధికారులకు కలెక్టర్ ఆదేశం ● కోతకు గురైన రోడ్డు పరిశీలన
శివ్వంపేట(నర్సాపూర్): వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టేందుకు వెంటనే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. మంగళవారం మండల పరిధి పోతులబోగూడ వద్ద కోతకు గురైన వెల్దుర్తి,– ఉసిరికపల్లి ప్రధాన రోడ్డును, అలాగే.. గుండ్లపల్లిలో తెగిపోయిన కాల్వను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పోతులబోగూడ వద్ద తెగిపోయిన రోడ్డుకు తక్షణ మరమ్మతులు చేపట్టి వాహన రాకపోకలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ అధికారులను అదేశించారు. గుండ్లపల్లి వద్ద కట్టుకాల్వను తొలగించడంపై విచారణ జరపాలన్నారు. కాల్వకు వెంటనే మరమ్మతు చేపట్టాలని, వరదనీరు కుంటల్లోకి చేరే విధంగా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ సిబ్బందికి అదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ మహిపాల్‌రెడ్డి, ఇరిగేషన్ డీఈ బుచ్చిబాబు, తహసీల్థార్ కమలాద్రి, ఎంపీడీఓ వెంకటలక్ష్మయ్య, ఆర్‌ఐ కిషన్, ఎంపీఓ తిరుపతిరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఏఈ మహేష్, ఏఓ లావణ్య, జిల్లా రైతు సమితి గౌరవ అధ్యక్షుడు మైసయ్యయాదవ్ ఉన్నారు.
అప్రమత్తంగా ఉండండి
కౌడిపల్లి(నర్సాపూర్): భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. మండలంలోని తునికిలో కూలిన ఇళ్లను ఆయన పరిశీలించారు. ఖలీల్‌సాగర్ చెరువు, కుంటను పరిశీలించారు. మంజీర, హల్దీవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, సింగూరు నుంచి 43 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని, దీంతో వరద పెరుగుతోందన్నారు. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇళ్లు కూలిన వారికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టా మని కలెక్టర్ తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకూడదన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చెప్పారు.ఆయన వెంట తహసీల్దార్ కృష్ణ, ఆర్‌ఐ శ్రీహరి, పంచాయతీ కార్యదర్శి సౌజన్య ఉన్నారు.
బస్తా యూరియా ఇవ్వలేరా..?
వెల్దుర్తి(తూప్రాన్): యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించారు. మంగళవారం మండల పరిధిలోని హల్దీ ప్రాజెక్టును సందర్శించి గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమృద్ధిగా వర్షాలు పడడంతో చెరువులు, కుంటల్లో జలకళ సంతరించుకుందని హర్షం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. రోజంతా క్యూలో నిల్చున్నా ఒక్క బస్తా కూడా దొరకని పరిస్ధితి నెలకొందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని గుర్తు చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రైతులకు కావాల్సిన యూరియా అందు బాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, నాయకులు నాగరాజు, శ్రీనివాస్, రమేష్‌గౌడ్, కృష్ణగౌడ్, తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రశ్న

తక్షణమే మరమ్మతులు