
పీఎస్‌హెచ్‌ఎంఏ ఉపాధ్యక్షుడిగా గాలయ్య
చిన్నశంకరంపేట(మెదక్): ప్రాథమిక పాఠశాలల ప్రాధానోపాధ్యాయుల సంఘం (పీఎస్‌హెచ్‌ఎంఏ) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం వి.గాలయ్య ఎన్నికయ్యారు. ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంల సమస్యలపై పోరాడుతానని ఆయన చెప్పారు. తనపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మురళీధర్‌గౌడ్, మురళీకి కృతజ్ఞతలు తెలిపారు.
బాధితులను ఆదుకుంటాం
అదనపు కలెక్టర్ నగేశ్
అల్లాదుర్గం(మెదక్): వర్షాలతో నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని అదనపు కలెక్టర్ నగేశ్ భరోసా కల్పించారు. మంగళవారం అల్లాదుర్గం, చిల్వెర గ్రామాలలో ఆయన పర్యటించారు. అల్లాదుర్గంలో గండిపడిన బంటికుంట చెరువును పరిశీలించారు. రోడ్డుపై వరద ప్రవహిస్తుండటంతో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తహసీల్దార్ మల్లయ్యను అదేశించారు. అనంతరం చిల్వెర పెద్ద చెరువు కోతకు గురి కావడంతో ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ముందుస్తు జాగ్రత్తగా గండి పడకుండా మరమ్మత్తు చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట ఇరిగేషన్ ఈఈ రవీంద్ర కిషన్, అల్లాదుర్గం డీఈఈ సుబ్బలక్ష్మి, ఏఈ వైష్ణవి, ఎంపీడీఓ చంద్రశేఖర్, ఎంపీఓ లింగప్ప తదితరులు పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండండి
జెడ్పీ సీఈఓ ఎల్లయ్య
నిజాంపేట(మెదక్): భారీ వర్షాలకు చెరువులు, కుంటలు అలుగు పారడంతో ప్రమాదకరంగా ఉన్న కల్వర్టులు జెడ్పీ సీఈఓ ఎల్లయ్య పరిశీలించారు. నందిగామ సాయి చెరువు, చల్మెడ గ్రామంలోని సోమయ్య చెరువు అలుగు పారడంతో నిజాంపేట, చల్మెడ గ్రామాల మధ్య రోడ్డుకు రాకపోకలు నిచిలిపోయాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చల్మెడ , నిజాంపేట రోడ్డులో కల్వర్టులపై నుంచి వరద ప్రవహించడంతో రోడ్డును తాత్కలికంగా మూసి వేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎంపీడీఓ రాజిరెడ్డి, ఇన్‌చార్జి ఏంపీఓ వెంకట నర్సింహారెడ్డి, నగరం కార్యదర్శి ఆరిఫ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
ఫోరెన్సిక్ విభాగం
మరింత బలోపేతం: ఎస్పీ
మెదక్ మున్సిపాలిటీ: ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. నేరాలను త్వరితగతిన పరిష్కరించడంలో ఫోరెన్సిక్ విభాగం ఎంతో కీలకమని చెప్పారు. మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ మొబైల్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యాధునిక పరికరాలతో రూపొందించిన ఈ వాహనాన్ని జిల్లా పోలీసులకు మెరుగైన సేవలందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ పాల్గొన్నారు.
వేతనాలు వెంటనే చెల్లించాలి
మెదక్ కలెక్టరేట్: పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని ఆశా వర్కర్స్ యూనియ న్ జిల్లా కార్యదర్శి సావిత్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హవేళిఘణాపూర్ మండలంలోని సర్ధన పీహెచ్‌సీ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పీఆర్సీ, ఏరియర్స్, పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏఎన్‌ఎం జీఎన్‌ఎం ట్రైనింగ్ పూర్తిచేసిన ఆశావర్కర్లకు వెంటనే ఖాళీ పోస్టుల్లో ఉద్యోగాన్ని ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సరోజ, స్వప్న, సరళ, శోభ, సునీత తదితరులు పాల్గొన్నారు.

పీఎస్‌హెచ్‌ఎంఏ ఉపాధ్యక్షుడిగా గాలయ్య