
నిర్లక్ష్యంతోనే చెరువులకు గండ్లు: క్రాంతి
అల్లాదుర్గం(మెదక్): ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతోనే చెరువులు, కుంటలు, కట్టుకాల్వలకు గండ్లు పడ్డాయని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆరోపించారు. మంగళవారం అల్లాదుర్గంలో బంటికుంట చెరువుకు గండిపడటంతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలో భారీ వర్షాలకు రైతుల పంటలు నీట ముని గినా, పేదల ఇళ్లు దెబ్బతిని కూలిపోయినా మంత్రి దామోదర స్పందించకపోవడం దారుణమన్నారు. నష్టపోయిన బాధితులకు వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.