
యూరియా తిప్పలు.. క్యూలో రైతులు
చేగుంట(తూప్రాన్): చేగుంట మండల కేంద్రంలో శనివారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. రైతు సేవా కేంద్రానికి యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు ఉదయం దుకాణం తెరిచేలోగా భారీగా చేరుకున్నారు. కేవలం 240 బస్తాల యూరియా రావడంతో నిర్వాహకులు రైతులను క్యూలో రావాలని కో రారు. దీంతో వర్షాన్ని సైతం లెక్క చేయకండా క్యూలో నిలబడ్డారు. గొడవ జరగకుండా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే యూరియా వచ్చిన గంటలోపే అయిపోయింది. ఆదివారం తెప్పిస్తామని అధికారులు హామీ ఇవ్వగా రైతులు వెళ్లిపోయారు. ఇబ్రహీంపూర్ సహకార సంఘం వద్ద సైతం యూరియా కోసం రైతులు ఎగబడటంతో కొంతసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది.