
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మెదక్ కలెక్టరేట్: మున్సిపల్, పంచాయతీ కార్మికులకు నిధులు, నియామకాలు పెంచాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీఓ భవన్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది నుంచి సబ్బులు, నూనెలు, గ్లౌజ్‌లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు పెంచాలన్నారు. ప్రభుత్వాలు జీఓలను అమలు చేయకపోవడంతో కార్మికులు ప్రతినెల రూ. 6 వేల కోట్లు నష్టపోతున్నారని తెలిపారు. కాంటాక్ట్, అవుట్ సోర్సింగ్, డైలీ వేజ్ పేర్లతో నియమకాలు చేపడుతూ కార్మికులను అన్యాయం చేస్తుందన్నారు. ఉద్యోగ భద్రత కల్పించడం లేదని వాపోయారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్, మహాసభల ఆహ్వాన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అడివయ్య, జిల్లా అధ్యక్ష, కార్య దర్శులు బాలమణి, మల్లేశం, జిల్లా కోశాధికారి నర్సమ్మ, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్