
తండాల్లో సమస్యల పరిష్కారానికి కృషి
రామాయంపేట(మెదక్): గిరిజన తండాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హామీ ఇచ్చారు. మండలంలోని జెమ్లా తండాలో సేవాలాల్ విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా తాను పనిచేస్తున్నానన్నారు. నియోజకవర్గం పరిధిలో దాదాపు గిరిజన తండాలకు తారు రోడ్డు సదుపాయం కల్పించామని మిగిలిన తండాలకు సైతం త్వరలోనే రోడ్డు సదుపాయం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిధులతోపాటు తన సొంత నిధులతో కూడా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. సమావేశంలో టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, పార్టీ నాయకులు బండారి మహేందర్‌రెడ్డి, పాండు నాయక్, బన్సీ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్