
విద్య, వైద్యానికి ప్రాధాన్యం
● ఎమ్మెల్యే రోహిత్‌రావు ● సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
మెదక్‌జోన్: తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. మంగళవారం పట్టణంలో నియోజకవర్గంలోని 223 మంది లబ్ధిదారులకు రూ.63 లక్షల విలువ గల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం తమ ప్రభుత్వానికి రెండు కళ్లు లాంటివని చెప్పారు. ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. రామాయంపేటలో రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామని తెలిపారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యే విమర్శించారు. తమ ప్రభుత్వం అర్హులందరికీ కార్డులు ఇచ్చి పేదలకు అండగా నిలిచిందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ టి.చంద్రపాల్, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, శంకర్, బ్లాక్ కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పవన్, శ్రీనివాస్ చౌదరి, మహేందర్ రెడ్డి, నాగరాజు, ఆంజనేయులు గౌడ్ పాల్గొన్నారు.