
ఫీ‘వర్రీ’
నర్సాపూర్: మున్సిపాలిటీ పరిధిలో పలువురు డెంగీతో పాటు మలేరియా, వైరల్ ఫీవర్‌తో సతమతం అవుతున్నారు. పట్టణంలోని ఆరో వార్డులో ఒకే ఇంటిలో ముగ్గురు, మరో ఇంటిలో ఒకరు డెంగీ బారిన పడి ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నట్లు తెలిసింది. తాజాగా మరో ఇద్దరు డెంగీ బారినపడ్డారని తెలిసింది. దోమలు పెరగకుండా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై మండల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రఘువరుణ్‌ను వివరణ కోరగా, గతంలో ఐదుగురు డెంగీ బారినపడి వైద్యం చేయించుకొని ఇంటికి వచ్చారని, తాజాగా మరో ఇద్దరు వైద్యం పొందుతున్నారని చెప్పారు. తమ సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఫీవర్ సర్వే చేస్తున్నారని, వ్యాధులు ప్రబలకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.