
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
శివ్వంపేట(నర్సాపూర్): మనోహరాబాద్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏఈ రాకేశ్ తెలిపారు. శివ్వంపేట మండలంలోని సికింద్లాపూర్, గోమారం, చండి, శభాశ్‌పల్లి పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు ఆయా సబ్‌స్టేషన్ల పరిధిలో త్రీ ఫేజ్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. వినియోగదారులు, రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
‘పైరవీలకు తావు లేదు’
మెదక్ మున్సిపాలిటీ: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్ర జల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 21 ఫిర్యాదులు రాగా, వాటిని పరిశీలించి చట్ట ప్రకారం ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, పైరవీలకు తావు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
పరిశ్రమల్లో ప్రమాదాలను నివారించాలి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, మంగళవారం జరిగే సమావేశానికి ట్రేడ్ యూనియన్లను ఆహ్వానించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అజ్జమర్రి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం అదనపు కలెక్టర్ నగేశ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని పరిశ్రమల్లో నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సరైన రక్షణ చర్యలు ఉండటం లేదని వాపోయారు. గతంలో ట్రేడ్ యూనియన్‌తో సేఫ్టీ కమిటీ వేశారని, ఒక్కసారి కూడా అధికారులు సమావేశం జరపలేదని వా పోయారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ పాల్గొన్నారు.
హెచ్‌పీసీకి విద్యార్థి ఎంపిక
మెదక్ కలెక్టరేట్: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (రామంతాపూర్)కు సోమవారం లాటరీ ద్వా రా విద్యార్థిని ఎంపిక చేశారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్ పాల్గొన్నారు. పాఠశాలలో 1వ తరగతికి ఇంగ్లీష్ మీడియంలో ఒక సీటు ఖాళీ ఉండగా, ఇటీవల పత్రిక ప్రకటన చేశారు. ఇందుకు పలువురు విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, నార్సింగి మండలం జప్తిశివనూర్‌కు చెందిన దొబ్బల రోసిన ఎంపికై నట్లు తెలిపారు.
అంగన్‌వాడీల్లో
ప్రీ ప్రైమరీ నిర్వహించాలి
మెదక్ కలెక్టరేట్: అంగన్‌వాడీ కేంద్రాల్లోనే ప్రీ ప్రైమరీ పీఎం శ్రీ విద్యను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం డీడబ్ల్యూఓ హైమావతికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ.. కేంద్రం ప్రీ ప్రైమరీ పీఎం శ్రీ విద్యను తీసుకొచ్చి అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. జిల్లాలో 3 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులు, గర్భిణుల్లో పోషకాహార లోపాన్ని నివారించడంలో అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కేంద్రం ప్రత్యేక వలంటీర్లను నియమించి అదనపు కేంద్రాలను నిర్వహించాలని చూస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను కాపాడుకోకుండా, కేంద్రానికి వత్తాసు పలుకుతుందని మండిపడ్డారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు జబీన్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి యోగా
పోటీలకు ఎంపిక