
అర్జీలను త్వరగా పరిష్కరించాలి
మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జిల్లాస్థాయి ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్‌రాజ్, అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య ఇతర జిల్లా అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. మొత్తం 66 అర్జీలు రాగా వాటిని పరిశీలించారు. త్వరితగతిన అర్జీలు పరిష్కరించి ప్రజలకు సమాఽ దానం చెప్పాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. కాగా ఓ దివ్యాంగురాలు తనకు ఇందిరమ్మ ఇంటి మంజూరులో నెలకొన్న సమస్యను కలెక్టర్‌కు విన్నవించారు. స్పందించిన ఆయన దివ్యాంగురాలికి న్యాయం జరిగేలా చూడాలని డీఎల్‌పీఓకు సూచించారు. అనంతరం దివ్యాంగురాలు కలెక్టర్‌కు రాఖీ కట్టింది.
నులి పురుగులను నులుమేద్దాం
మెదక్‌జోన్: నులి పురుగుల నివారణకు అల్బెండజో ల్ మాత్రలు తప్పనిసరిగా వాడాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. జాతీయ నులి పురుగుల దినో త్సవం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పలువురికి మాత్రలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కడుపులో ఏర్ప డే నులిపురుగుల వల్ల పిల్లల ఎదుగుదల మందగించడంతో పాటు నీరసం, రక్తహీనత, చదువులో ఏకాగ్రత కోల్పోతారని అన్నారు. నివారణకు ఏకై క మార్గం మాత్రలు మింగటమేనన్నారు. జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల వయస్సు గల వారు 2,11,964 మంది ఉన్నారని, అందరికీ మాత్రలు పంపిణీ చేస్తామన్నారు. అనంతరం వంటశాల, నిత్యావసర వస్తువులు, కూరగాయలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ శ్రీరామ్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ అనిలా, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ మాధురి, మలేరియా అధికారి నవ్య, ప్రోగ్రాం అధికారి హరిప్రసాద్ పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్
ప్రజావాణికి 66 వినతులు