
నేరాల నియంత్రణకు కృషి చేయాలి
మెదక్‌మున్సిపాలిటీ/శివ్వంపేట(నర్సాపూర్)/వెల్దుర్తి(తూప్రాన్): నేరాల నియంత్రణకు పోలీస్ సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ శ్రీనివాస్‌రావు అన్నారు. సోమవారం సాయంత్రం శివ్వంపేట పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. పరిసరాలు, రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామాల్లోని ప్రధాన కూడలిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్య లు చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రమాదాలు జరిగే చోట సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. డ్రగ్స్, గంజాయి వంటి అమ్మకాలు జిల్లాలో ఎక్కడా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్, సీఐ రంగాకృష్ణ, ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు. అనంతరం వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల గురించి ఆరా తీశారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసేవారికి తగిన గుర్తింపు వస్తుందన్నారు. ఇదిలాఉండగా సైబర్ నేరాలపై జిల్లా పోలీ స్ ప్రధాన కార్యాలయం నుంచి ఎస్పీ ఒక ప్రకటన విడుదల చేశారు. అప్రమత్తంగా ఉండటంతోనే సైబర్ నేరాలను అడ్డుకోగలమని తెలిపారు.
ఎస్పీ శ్రీనివాస్‌రావు