
బడులకు స్టార్ రేటింగ్
పాపన్నపేట(మెదక్): పాఠశాలలను హరిత వనాలుగా.. పరిశుభ్ర కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు బడులకు రేటింగ్ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. గతంలో ఉన్న స్వచ్ఛ విద్యాలయ పురస్కార్‌లో మార్పులు చేసి, స్వచ్ఛ ఏవమ్ విద్యాలయ రేటింగ్ (ఎస్‌హెచ్‌వీఆర్) 2025–26 పేరిట బడులకు రేటింగ్ పథకం ప్రారంభించనున్నారు. జాతీయ స్థాయికి ఎంపికై న పాఠశాలలకు స్వచ్ఛ విద్యాలయ పురస్కార్‌తో పాటు రూ. లక్ష ప్రోత్సాహకం అందించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మొత్తం ఆరు ప్రధాన కొలమానాలకు సంబంధించి 60 సూచికల ఆధారంగా ఒకటి నుంచి ఐదు స్టార్లు కేటాయించనున్నారు. ఒక్కో జిల్లా నుంచి 8 పాఠశాలలను ఈ పథకం కింద ఎంపిక చేస్తారు.
ఉమ్మడి జిల్లాలో 4,698 పాఠశాలలు
ఉమ్మడి జిల్లాలో వివిధ కేటగిరిలకు చెందిన 4,698 పాఠశాలలున్నాయి. మెదక్‌లో 1067, సిద్దిపేటలో 1,862, సంగారెడ్డిలో 1,769 పాఠశాలలున్నాయి. 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్న అన్ని పాఠశాలలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఎస్‌హెచ్‌వీఆర్ పోర్టల్‌లో నమోదు చేయాలి. ప్రతి సూచికకు సంబంధించిన ఆధారాలు అప్‌లోడ్ చేయాలి. పరిశీలకులు స్వయంగా పరిశీలించి ఒకటి నుంచి ఐదు వరకు రేటింగ్ ఇస్తారు. ఉత్తమ స్కోర్ సాధించిన బడులకు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో గుర్తింపు ఇస్తారు. ఒక్కో జిల్లా నుంచి 8 పాఠశాలలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయిలో గరిష్టంగా 20 పాఠశాలలకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు. వాటిని జాతీయ స్థాయికి పంపిస్తారు. జాతీయ స్థాయికి ఎంపికై న పాఠశాలలకు రూ. లక్ష చొప్పున ప్రోత్సాహక నగదు అందజేస్తారు. సంబంధిత హెచ్‌ఎంలు, ప్రిన్సిపాల్స్ దేశంలోని ప్రముఖ సంస్థలను సందర్శించే అవకాశం కల్పిస్తారు. 6 అంశాలు..
60 సూచికలు ప్రధానం
ఆరు అంశాల ఆధారంగా పాఠశాలలకు రేటింగ్ ఇస్తారు. పాఠశాలలో నీటి సదుపాయం, వాన నీటి సంరక్షణ, వినియోగం, టా యిలెట్ సౌకర్యాలు, విద్యార్థులకు సబ్బుతో హాండ్ వాషింగ్, వ్యర్థాల నిర్వహణ, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ వాడకం తగ్గించడం, విద్యు త్ సదుపాయం, బిహేవియర్ మా ర్పు, కెపాసిటీ నిర్మాణం, మిషన్ లైఫ్ యాక్టివిటీస్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు.
పచ్చదనం.. పరిశుభ్రతే లక్ష్యం
ఒక్కో జిల్లా నుంచి 8 పాఠశాలలు ఎంపిక
జాతీయస్థాయికి ఎంపికై తే రూ. లక్ష ప్రోత్సాహకం
మెదక్‌లో 1,067, సిద్దిపేట 1,862, సంగారెడ్డి 1,769 స్కూళ్లు