
మల్లన్న దరి.. భక్తఝరి
కొమురవెల్లి మల్లన్న ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పరిసరాలు స్వామి వారి నామస్మరణతో మారుమోగాయి. తెల్లవారుజామునుంచే స్వామిదర్శనానికి భక్తులు బారులు తీరారు. అభిషేకాలు, నిత్యకల్యాణం, ప్రత్యేకపూజలు చేశారు. పట్నాలు, గంగిరేణు చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ ఏఈఓ బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్ రెడ్డి, ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్ పర్యవేక్షించారు.
– కొమురవెల్లి(సిద్దిపేట)